వేమన శతకం
ఆ. పాల నీడిగింట | గ్రోలుచు నుండెనా
మనుజులెల్ల గూడి | మద్యమండ్రు
నిలువదగని చోట | నిలువ నిందలు వచ్చు
విశ్వదాభిరామ | వినురవేమ!
తాత్పర్యము: ఓ వేమా! కల్లు అమ్ము వారింటి యండు పాలు త్రాగుచున్ననూ, అందరు మనుష్యులు అతడు కల్లునే త్రాగుచున్నాడని అందురు. ఎందుకనగా అది కల్లు త్రాగే చోటు. ఏమి త్రాగినా జనులు కల్లుగానే భావిస్తారు. అందువలన ఉండగూడని చ్ట ఎట్టి పరిస్థితులలోను ఉండ కూడదు.
Vemana Shatakam -29