సుమతీ శతకము.
క. కప్పకు నొరగాలైనను
సప్పమునకు రోగగమైన| సతి తులువైనన్
ముప్పున దరిద్రుడైనను
దప్పదు మఱి దుఃఖమగుట| తథ్యము సుమతీ! ||27||
తాత్పర్యము : సుమతీ! కప్పకు కాలు విరిగిననూ, పామునకు రోగము వచ్చిననూ, భార్య దుష్టురాలైననూ, ముసలితనములో దారిద్ర్యము వచ్చిననూ మిక్కిలి దుఃఖప్రదముగా యుండును. ఇది తథ్యము.
Sumati Shatakamu – 27