లక్ష్మీనృసింహకరావలమ్బస్తోత్రమ్

॥ శ్రీ శంకరాచార్య కృతం లక్ష్మీనృసింహకరావలమ్బస్తోత్రమ్॥

శ్రీమత్పయోనిధినికేతనచక్రపాణే

భోగీన్ద్రభోగమణిరఞ్జిత పుణ్యమూర్తే ।

యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్ ॥ 1 ॥

శ్రీమంతమైన పాలసముద్రమునందు ఉండువాడా! చక్రపాణీ! యోగీశ్వరుడా! శాశ్వతుడా! శరణుపొందదగినవాడా! సంసారసముద్రము దాటించు నౌకయైనవాడా! ఓ లక్ష్మీనరసింహా! నాకు చేయూతనిమ్ము.

బ్రహ్మేన్ద్రరుద్రమరుదర్కకిరీటకోటి-

సఙ్ఘట్టితాఙ్ఘ్రికమలామలకాన్తికాన్త ।

లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్ ॥ 2॥

బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు, మరుత్తులు, సూర్యుడు మొదలైన దేవతలు ప్రణమిల్లగా వారి కిరీటములు ఒరుసుకొనుచున్న పాదపద్మముల కాంతితో రమణీయమైనవాడా! లక్ష్మీదేవి యొక్క స్తనపద్మములందు విహరించు రాజహంసమా! ఓ లక్ష్మీనరసింహా! నాకు చేయూతనిమ్ము.

సంసారదావదహనాకరభీకరోరు-

జ్వాలావలీభిరతిదగ్ధతనూరుహస్య ।

త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్ ॥ 3 ॥

సంసారమనే దావాగ్నియొక్క భయంకర జ్వాలలచే దహించబడి నీ పాదపద్మములను ఆశ్రయించిన నాకు ఓ లక్ష్మీనరసింహా! చేయూతనిమ్ము.

సంసారజాలపతితస్య జగన్నివాస

సర్వేన్ద్రియార్థబడిశాగ్రఝషోపమస్య ।

ప్రోత్కమ్పితప్రచురతాలుకమస్తకస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్ ॥ 4 ॥

సంసారమనే వలలో పడి , ఇంద్రియ సుఖములనే గాలమునకు చిక్కిన చేపవలే ఉన్న , దవడలు వణుకుచూ తలతిరుగుచున్న నాకు ఓ జగన్నివాసా! లక్ష్మీనరసింహా! చేయూతనిమ్ము.

సంసారకూపమతిఘోరమగాధమూలం

సమ్ప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య ।

దీనస్య దేవ కృపయా పదమాగతస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్ ॥ 5 ॥

అతిఘోరమైన , అంతులేని లోతుగల సంసారకూపములో పడి , దుఃఖములనే వందలకొలది పాములచే చుట్టుముట్టబడి నీ పాదములు చేరిన దీనుడనైన నాకు ఓ దేవా! లక్ష్మీనరసింహా! కృపతో చేయూతనిమ్ము.

సంసారభీకరకరీన్ద్రకరాభిఘాత-

నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ ।

ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్ ॥ 6 ॥

సమస్త దుఃఖములనూ నసింపచేయు ఓ లక్ష్మీనరసింహా!  సంసారమనే భయంకరమైన మదపుటేనుగు తొండము దెబ్బలచే నలిగిపోయిన , మరణభయముచే వ్యాకులచిత్తుడనైన నాకు చేయూతనిమ్ము.

సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర-

దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః ।

నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్ ॥ 7 ॥

సర్పములకు శత్రువైన గరుడుడు వాహనముగా కలవాడా!  అమృతసాగరము నందు నివసించువాడా! లక్ష్మీనరసింహా! సంసారమనే సర్పము యొక్క మహోగ్రములైన , విషముతో నిండిన కోరలచే కరవబడి క్షీణించుచున్న నాకు చేయూతనిమ్ము.

సంసారవృక్షమఘబీజమనన్తకర్మ-

శాఖాయుతం కరణపత్రమనఙ్గపుష్పమ్ ।

ఆరుహ్య దుఃఖఫలితం చకితం దయాలో

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్ ॥ 8 ॥

పాపమే బీజముగా , అంతులేని కర్మలే కొమ్మలుగా, ఇంద్రియములే ఆకులుగా, కామములే పుష్పములుగా, దుఃఖములే ఫలములుగా కల సంసార వృక్షమునెక్కి బాధపడుచున్న నాకు దయామయుడవైన ఓ లక్ష్మీనరసింహా! చేయూతనిమ్ము.

సంసారసాగరవిశాలకరాలకాల-

నక్రగ్రహగ్రసితనిగ్రహవిగ్రహస్య ।

వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్ ॥ 9 ॥

సంసారమనే సముద్రములోని భయంకరమైన పెద్దమొసళ్ళు నా నిగ్రహమును మింగగా కలత చెందినవాడను, మమకారమనే అలలచే పీడింపబడుచున్నవాడను అయిన నాకు ఓ లక్ష్మీనరసింహా! చేయూతనిమ్ము.

సంసారసాగరనిమజ్జనముహ్యమానం

దీనం విలోకయ విభో కరుణానిధే మామ్ ।

ప్రహ్లాదఖేదపరిహారపరావతార

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్ ॥ 10 ॥

ఓ ప్రభూ! కరుణానిధీ!  సంసారసాగరములో మునిగి మూర్చిల్లిన దీనుడైన నన్ను చూడుము. ప్రహ్లాదుని దుఃఖమును తొలగించుటకు అవతారమెత్తిన ఓ లక్ష్మీనరసింహా! నాకు చేయూతనిమ్ము.

సంసారఘోరగహనే చరతో మురారే

మారోగ్రభీకరమృగప్రచురార్దితస్య ।

ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్ ॥ 11 ॥

సంసారమనే ఘోరమైన, దారి తెలియని అడవిలో సంచరించుచూ, కామములనే భయంకర మృగములచే పీడింపబడుచూ, మాత్సర్యమనే వడగాల్పు వలన తపించుచూ దుఃఖించు నాకు ఓ మురారీ! లక్ష్మీనరసింహా! చేయూతనిమ్ము.

బద్ధ్వా గలే యమభటా బహు తర్జయన్తః

కర్షన్తి యత్ర భవపాశశతైర్యుతం మామ్ ।

ఏకాకినం పరవశం చకితం దయాలో

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్ ॥ 12 ॥

సంసారబంధములలో చిక్కి, ఏకాకినై, పరాధీనుడనై, భయపడుచున్న నన్ను యమభటులు బెదిరించుచూ మెడకు తాడుకట్టి ఈడ్చుకుపోవునప్పుడు ఓ దయామయా! లక్ష్మీనరసింహా! నాకు చేయూతనిమ్ము.

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో

యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప ।

బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్ ॥ 13 ॥

ఓ లక్ష్మీపతీ! పద్మనాభా! దేవనాయకా! విష్ణుమూర్తీ! యజ్ఞరక్షకుడా! యజ్ఞస్వరూపుడా! మధుసూదనా! విశ్వరూపుడా! బ్రహ్మనిష్ఠుడా! కేశవా! జనార్దనా! వాసుదేవా! లక్ష్మీనరసింహా! నాకు చేయూతనిమ్ము.

ఏకేన చక్రమపరేణ కరేణ శఙ్ఖ-

మన్యేన సిన్ధుతనయామవలమ్బ్య తిష్ఠన్ ।

వామేతరేణ వరదాభయపద్మచిహ్నం

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్ ॥ 14॥

ఒక చేతితో చక్రమును, వేరొక చేతితో శంఖమును, మరొక చేతితో లక్ష్మీదేవిని పట్టుకుని, వరదం – అభయం – పద్మచిహ్నములు ధరించిన కుడి చేతితో లక్ష్మీనరసింహా! నాకు చేయూతనిమ్ము.

అన్ధస్య మే హృతవివేకమహాధనస్య

చోరైర్మహాబలిభిరిన్ద్రియనామధేయైః ।

మోహాన్ధకారకుహరే వినిపాతితస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్ ॥ 15 ॥

తత్త్వమును తెలుసుకోలేని గుడ్డివాడనైన నాయొక్క వివేకమనే మహాధనమును ఇంద్రియములనే మహాబలవంతులైన దొంగలు అపహరించి , నన్ను అజ్ఞానమనే గాఢాంధకారములో పడత్రోసిరి. ఓ లక్ష్మీనరసింహా! నాకు చేయూతనిమ్ము.

ప్రహ్లాదనారదపరాశరపుణ్డరీక-

వ్యాసాదిభాగవతపుఙ్గవహృన్నివాస ।

భక్తానురక్తపరిపాలనపారిజాత

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్ ॥ 16 ॥

ప్రహ్లాదుడు – నారదుడు – పరాశరుడు – పుండరీకుడు – వ్యాసుడు మొదలైన భక్తశ్రేష్ఠుల హృదయాలలో నివసించువాడా!   భక్తులను పాలించు కల్పవృక్షమా! ఓ లక్ష్మీనరసింహా! నాకు చేయూతనిమ్ము.

లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన

స్తోత్రం కృతం శుభకరం భువి శఙ్కరేణ ।

యే తత్పఠన్తి మనుజా హరిభక్తియుక్తా-

స్తే యాన్తి తత్పదసరోజమఖణ్డరూపమ్ ॥ 17 ॥

లక్ష్మీనరసింహుని పాదపద్మములందలి మకరందమును ఆస్వాదించు తుమ్మెదవంటి వాడైన శంకరాచార్యునిచే శుభకరమైన ఈస్తోత్రము రచించబడినది. ఏమానవులు హరిభక్తులై ఆస్తోత్రమును పఠించెదరో వారు అఖండరూపమైన లక్ష్మీనరసింహుని పాదపద్మములను చేరెదరు.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం లక్ష్మీనృసింహకరావలమ్బస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Lakshmi Nrisimha Karavalamba Stotram

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s