మంగళహారతి (నవరోజు – తిశ్ర ఏక)
పల్లవి:
రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం రా..
చరణము(లు):
కోసలేశాయ మందహాస దాసపోషణాయ
వాసవాదివినుత సద్వరాయ మంగళం రా..
చారుమేఘరూపాయ చందనాది చర్చితాయ
హారకటకశోభితాయ భూరిమంగళం రా..
లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయ
జలదసదృశ దేహాయ చారు మంగళం రా..
దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ
భావజ గురువరాయ భవ్యమంగళం రా..
పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ
అండజవాహనాయ అతులమంగళం రా..
విమలరూపాయ వివిధవేదాంత వేద్యాయ
సుముఖచిత్త కామితాయ శుభదమంగళం రా..
రామదాసాయ మృదుల హృదయ కమలనివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రా..