భద్రాచల రామదాసు కీర్తన: ననుబ్రోవమని చెప్పవే
రాగం: కల్యాణి
తాళం: ఆది (త్రిపుట)
పల్లవి:
ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి న..
చరణములు:
ననుబ్రోవమని చెప్పవే నారీశిరోమణి
జనకుని కూతుర జనని జానకమ్మ న..
ప్రక్కను చేరుక చెక్కిలి నొక్కుచు
చక్కగ మరుకేళి సొక్కుచుండెడి వేళ న..
ఏకాంతరంగుడు శ్రీకాంత నినుగూడి
ఏకాంతమున నేకశయ్యనున్న వేళ న..
అద్రిజవినుతుడు భద్రగిరీశుడు
నిద్రమేల్కొనువేళ నెలతరో బోధించి న..
Nannubrovammani cheppave : Bhadrachala Ramadasa