హిందోళము – ఆది
పల్లవి:
సామజవరగమన సాధుహృ-
త్సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత ॥సా॥
అను పల్లవి:
సామనిగమజ సుధామయ గాన విచక్షణ
గుణశీల దయాలవాల మాం పాలయ ॥సా॥
చరణము:
వేదశిరోమాతృజ సప్తస్వర
నాదాచలదీప స్వీకృత
యాదవకుల మురళీవాదన వి
నోద మోహనకర త్యాగరాజ వందనీయ ॥సా॥
Tyagaraja Kriti: Samajavaragamana