త్యాగరాజకీర్తన : వందనము రఘునందనా

శహన – ఆది

పల్లవి:

వందనము రఘునందనా సేతు – బంధనా భక్త చందనా రామ ॥వం॥

చరణములు:

శ్రీదమా నాతో వాదమా నే – భేదమా ఇది మోదమా రామ ॥వం॥

శ్రీరమా హృచ్చారమా బ్రోవ – భారమా రాయబారమా రామ ॥వం॥

వింటిని నమ్ము కొంటిని శర – ణంటిని రమ్మంటిని రామ ॥వం॥

ఓడను భక్తి వీడను ఒరుల – వేడను నీవాఁడను రామ ॥వం॥

కమ్మని విడె మిమ్మని వరము – కొమ్మని పలుకరమ్మని రామ ॥వం॥

న్యాయమా నీకాదాయమా ఇంత – హేయమా మునిగేయమా రామ ॥వం॥

చూడుమీ కాపాడుమీ మమ్ము – పోడిమిగాఁ గూడుమీ రామ ॥వం॥

క్షేమము దివ్యధామము నిత్య – నేమము రామనామము రామ ॥వం॥

వేగరా కరుణాసాగర శ్రీ – త్యాగరాజుని హృదయాకర రామ ॥వం॥

Tyagaraja Keertana : Vandanamu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s