త్యాగరాజకీర్తన :ఉయ్యాలలూగవయ్య శ్రీరామ

నీలామ్బరి – ఝంప

ఉయ్యాలలూగవయ్య శ్రీరామ

సయ్యాట పాటలను సత్సార్వభౌమ ||

కమలజాద్యఖిల సురలు నిను గొల్వ

విమలులైన మునీన్ద్రులు ధ్యానింప

కమనీయ భాగవతులు గుణ కీర్త

నమున నాలాపంబులు సేయగా ||

నారదాదులు మెరయుచు నుతియింప

సారముల బాగ వినుచు నిను నమ్ము

వారలను సదా బ్రోచుచు వేద

సార సభలను చూచుచు శ్రీరామ ||

నవ మోహనాంగులైన సుర సతులు

వివరముగ పాడగాను నా భాగ్యమా

నవరత్న మన్టపమున త్యాగరాజ

వినుతాకృతి బూనిన శ్రీరామ ||

Tyagaraja Keertana : Uyyalaloogavayya

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s