ముత్తుస్వామి దీక్షితుల కృతి: అరుణాచలనాథం
రాగం: సారంగ
తాళం: రూపక
పల్లవి –
అరుణాచలనాథం స్మరామి అనిశమ్
అపీతకుచామ్బా సమేతమ్
అనుపల్లవి –
స్మరణాత్ కైవల్యప్రద చరణారవిన్దమ్
తరుణాదిత్య కోటి సఙ్కాశచిదానన్దమ్
మధ్యమకాలసాహిత్యమ్ –
కరుణారసాది కన్దమ్ శరణాగత సురబృన్దమ్
చరణమ్ –
అప్రాకృత తేజోమయ లిఙ్గమ్ అత్యద్భుత కర ధృత సారఙ్గమ్
అప్రమేయమపర్ణాబ్జ భృఙ్గమ్ ఆరూఢోత్తుఙ్గ వృషతురఙ్గమ్
మధ్యమకాలసాహిత్యమ్ –
విప్రోత్తమ విశేషాన్తరఙ్గమ్ వీర గురుగుహ తార ప్రసఙ్గమ్
స్వప్రదీప మౌళివిధృతగఙ్గమ్ స్వప్రకాశ జిత సోమాగ్ని పతఙ్గమ్
Arunachalanatham- Muttuswami