నారాయణీస్తుతి (11-15)
శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే।
సర్వస్యార్తిహరేదేవినారాయణినమోఽస్తుతే॥ 11॥
నీవే శరణమని రక్షణార్థులై వచ్చిన బాధితులను, రక్షించుటయందు నిమగ్నమైయుమ్డు తల్లీ! ప్రతియొక్కరి బాధను తొలగించునట్టి దయామయా! జననీ ! ఓ నారాయణీ ! నీకు నమస్కారము.(11)
హంసయుక్తవిమానస్థేబ్రహ్మాణీరూపధారిణి।
కౌశామ్భఃక్షరికేదేవినారాయణినమోఽస్తుతే॥ 12॥
ఓ దేవీ ! నీవు హంసతో కూడిన విమానమందు సంచరించెదవు. బ్రహ్మశక్తిరూపమును ధరించినదానివి, దర్భసంబంధమైన జలములను ఆయుధములుగా ప్రయోగించి శత్రువులను సంహరించెదవు! ఓ నారాయణీ! నీకు నమస్కారము.(12)
త్రిశూలచన్ద్రాహిధరేమహావృషభవాహిని।
మాహేశ్వరీస్వరూపేణనారాయణినమోఽస్తుతే॥ 13॥
మహేశ్వరశక్తి స్వరూపముతో, చేత త్రిశూలమును, మౌళియందు చంద్రరేఖను, కంఠమునందు సర్పమును ధరించి, నందివాహనముపై సంచరించెడు ఓ నారాయణీ! నీకు నా నమస్కారము.(13)
మయూరకుక్కుటవృతేమహాశక్తిధరేఽనఘే।
కౌమారీరూపసంస్థానేనారాయణినమోఽస్తుతే॥ 14॥
కుమారశక్తి స్వరూపమున నున్న ఓ దేవీ ! నీవు నెమిళ్ళచేతను, కోళ్ళ చేతను, ఆవరింపబడియున్న దానవు. గొప్పనైన చిల్లకోలయను ఆయుధమును ధరించియున్నదానవు! పాపరహితురాలవు. ఐన ఓ నారాయణీ ! నీకు నా నమస్కారము. (14)
శఙ్ఖచక్రగదాశార్ఙ్గగృహీతపరమాయుధే।
ప్రసీదవైష్ణవీరూపేనారాయణినమోఽస్తుతే॥ 15॥
శంఖము, చక్రము, గద, ధనుస్సు, అను శ్రేష్ఠములైన నాలుగు ఆయుధములను ధరించి ఓ వైష్ణవీశక్తీ! అనుగ్రహింపుము. ఓ నారాయణీ! నీకు నమస్కారము. (15)
శ్రీ దుర్గాసప్తశతియందు ఏకాదశీఅధ్యాయము (గీతాప్రెస్, గోరఖ్పూర్ పుస్తకమునుండి)
Narayani Stuti
_____________________________________________________________
previous (6-10)-> https://shankaravani.org/2020/02/03/%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%a3%e0%b1%80%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%a4%e0%b0%bf6-10/
Narayani stuti complete (with meaning): నారాయణి స్తుతి పూర్తి (తాత్పర్యముతో) -> https://shankaravani.org/2020/12/20/%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%a3%e0%b1%80%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%a4%e0%b0%bf/
Narayani stuti complete : నారాయణి స్తుతి పూర్తి (పారాయణస్తోత్రం) ->https://shankaravani.org/2020/12/20/%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%a3%e0%b1%80%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%a4%e0%b0%bf%e0%b0%aa%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%a3%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4/