సుమతీ శతకము.
క. కనకపు సింహాసనమున
శునకముఁ గూర్చుండఁబెట్టి|శుభలగ్నమునఁన్
దొనరఁగ బట్టముగటిన
వెనుకటి గుణమేల మాను|వినరా సుమతీ !
తాత్పర్యము : సుమతీ! కుక్కను తీసుకొనివచ్చి మంచి ముహూర్తమును చూచి బంగారు సింహాసనం మీద దానిని కూర్చుండబెట్టి పట్టాభిషేకము చేసినప్పటికిని, దాని సహజగుణము ఎట్లు మానలేదో అట్లే పుట్టుకతో నీచులకు, ఉన్నత స్థితి కల్గిననూ నీచ బుద్ధులు పోవు అని భావము.
Sumati Shatakamu – 26