సుమతీ శతకము.
క. ఓడల బండ్లును వచ్చును
ఓడలు నాబండ్లమీఁద | నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడుఁ గలిమిలేమి | వసుధను సుమతీ !
తాత్పర్యము: సుమతీ ! నీటిలో ఓడల మీద బండ్లను, భూమిపై బండ్లమీద “నావ”లును వచ్చునట్లుగానే భాగ్యవంతులకు దారిద్ర్యమును, దారిద్ర్యవంతులకు భాగ్యమును బండి చక్రపుటాకుల వలె వచ్చును. ఈ భూమియందు కలిమిలేములు స్థిరముకాదని భావము.
Sumati Shatakamu – 24