వేమన శతకం
ఆ. ఎలుకతోలుఁదెచ్చి|ఏడాది యుతికిన
నలుపు నలుపెగాని|తెలుపురాదు
కొయ్యబొమ్మ దెచ్చి|కొట్టినఁబలుకదు
విశ్వదాభిరామ|వినురవేమ!
తాత్పర్యము : కొయ్యబొమ్మను తెచ్చి కొట్టినా, తిట్టినా పలుకదు. అట్లే ఎలుకతోలు తెచ్చి సంవత్సరకాలముపాటు ఉతికినను దానినలుపు రంగు పోదు, తెలుపు రానేరాదు. అట్లే మూర్ఖుని గుణమును ఎంత కాలము కృషి చేసినను మార్చలేమని భావము.
Vemana Shatakam -23