వేమన శతకం
ఆ. అల్పుడైనవాని|కధిక భాగ్యముగల్గ
దొడ్డవారిఁదిట్టి|తొలఁగ గొట్టు
అల్పజాతి మొప్పె|యధికుల నెఱుఁగునా
విశ్వదాభిరామ|వినురవేమ!
తాత్పర్యము : ఓ వేమా! హీనబుద్ధిగలవానికి సంపద గల్గినచో మంచి వారిని తిట్టి వెళ్ళగొట్టును. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటె గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట చేతగాదు.
Vemana Shatakam -21