సుమతీ శతకము.
క. ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని కొల్వగూడ | దదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్ప వసించిన విధంబు | గదరా సుమతీ !
తాత్పర్యము : సుమతీ! ఎల్లపుడు దోషములను వెదుకుచూ ఉండే యజమానుని సేవ చేయకూడదు. పాము నీడలో కప్ప ఉండినట్లుగా అది ప్రతిక్షణమునను ప్రాణాపాయము కలిగించునదే.
Sumati Shatakamu – 19