వేమన శతకం
ఆ. విద్యలేని వాడు | విద్యాధికుల చెంత
ఉండినంత పండి | తుండు కాడు
కొలని హంసల కడ | కొక్కెర ఉన్నట్లు
విశ్వదాభిరామ | వినురవేమా!
తాత్పర్యము : ఓ వేమా! కొలనులలో హంసల వద్ద కొంగ ఉన్ననూ ఆ కొంగ హంస కాదు. అట్లే చదువులేనివాడు గొప్ప చదువరి వద్ద ఉన్ననూ ఏ మాత్రము కూడా పండితుండు కాలేడు.
Vemana Shatakam -19