నిత్య తాంబూలము నోము కథ

నిత్య తాంబూలము నోము కథ

ఒక రాజు భార్య యందు ప్రేమ లేక సానికొంపలనుబట్టి యుండెను. అందుచే అతని భార్య దుఃఖించుచు , పార్వతి పూజలను చేయుచుండెను . ఒక నాడు ఆమె కలలో పార్వతీ దేవి కనిపించి “అమ్మా ! నీవు పూర్వము తాంబూల దానము చేయకపోవుటచే
నీకీజన్మలో నోటిదుర్వాసన వచ్చినది. అది భరింపలేక నీ భర్త  వేశ్యాగృహములకు పోవుచున్నాడు. కావున నీవు నిత్య తాంబూల దానము చేసితాంబూలము సేవింపుము. అట్లు ఏడాదయిన తర్వాత ఉద్యాపనము చేసుకొనుము. నీకష్టములు గట్టెక్కును”అని   
చెప్పెను . తెల్లవారిన తరువాత  ఆమె నోము నోచుకొని ప్రతి దినము ఒక తాంబూలమును ముత్తయిదువునకిచ్చి తానును తాంబూలము వేసుకొని  సంవత్సరం నిండినంతనే ఉద్యాపనము చేసుకొని , భర్త అనురాగములను పొంది ఆనందముగా ఉండెను .
ఉద్యాపన:
బంగారపు ఆకులు , వెండి చెక్కలు కలిపి తాంబూలములతో బ్రాహ్మణునకియ్యవలెను .

Nitya Tambulamu Nomu katha

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s