సౌందర్యలహరి 9 : కుండలినీ చక్రాలు : పరమాచార్యుల వ్యాఖ్య
మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్టానే హృదిమరుతమాకాశముపరి
మనోఽపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే || 9 ||
సారాంశం: అమ్మా! నీవు సుషుమ్నా మార్గంలో మూలాధారచక్రమునందు పృథివీతత్త్వమును, మణిపూరచక్రమునందు జలతత్త్వమును, అనాహతచక్రమునందు వాయుతత్త్వమును, విశుద్ధచక్రమునందు ఆకాశతత్త్వమును, భ్రూమధ్యమునందున్న ఆజ్ఞాచక్రమునందు మనోతత్త్వమును, చేధించుకుని సహస్రారచక్రమందు నీభర్తతో విహరించెదవు.
అమ్మవారిని కుండలినీ యోగంద్వారా, మంత్రయోగంద్వారా పూజించటం గురించీ, ఆ పూజా విధానాల ఫలాలగురించీ తరువాతి కొన్ని శ్లోకాలలో చెప్పబడింది.
కుండలినీ యోగంలో మానవశరీరంలోని ఆరు చక్రాలు చెప్పబడ్డాయి. వీటిని పద్మాలనికూడా వ్యవహరిస్తారు. అమ్మవారు ఈ చక్రాలలో నివసిస్తారని ఆచార్యులు అంటున్నారు – మొదటి అయిదు చక్రాలలో పృథివి మొదలయిన పంచ తత్వాల స్వరూపంలోనూ, ఆరవ చక్రంలో మనస్సుస్వరూపంలోనూ వసిస్తారని అంటున్నారు. ఈ పద్మాలను కలుపుతూ సుషుమ్నా నాడి ఉంటుంది. ఈ సుషుమ్నానాడి పైచివర సహస్రారపద్మంలో సహస్రదళకమలము ఉంటుంది. ఈ పద్మంలో అమ్మవారు తన పతి అయిన శివునితో ఐక్యమవుతుంది. దీని అర్థం ఏమిటంటే కుండలినీ శక్తిద్వారా ఇక్కడకు (సహస్రారానికి) తీసుకురాబడ్డ జీవునికి అమ్మవారు అద్వైతానందాన్ని ప్రసాదిస్తుంది. ఇదే తరువాతి శ్లోకంలో (9) చెప్పబడింది. “బ్రహ్మాండములో ఉన్నదే పిండాండములోనూ ఉంది”. అమ్మవారు ప్రపంచంగా విశ్వంగా విస్తరించినప్పుడు అందులోని మహాభూతాలనూ మహామనస్సుగా దాన్ని నియంత్రించే మహత్తునూ యోగాభ్యాసకులు తమ కుండలినీ చక్రాలలో అనుభూతి పొందవచ్చు. మహామనస్సు సహస్రదళపద్మంలో బ్రహ్మము అయిన శివునితో ఐక్యమయి సాధకునికి అద్వైతానుభూతి కలుగుతుంది.
Soundaryalahari 9 : Kundalini Chakras : Paramacharya Vyakhya
బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ
మన్వస్త్ర నాగదళ షోడశపత్ర యుక్తం
వృత్తత్రయంచ ధరణీ సదన త్రయంచ
శ్రీ చక్ర రాజ ఉదితః పరదేవతాయాః
🌺Sree mathre namaha🌺
LikeLike