శ్యామశాస్త్రుల్లవారి కీర్తన :దేవీ బ్రోవ సమయమిదే

రాగం: చింతామణి 
తాళం: ఆది

పల్లవి
దేవీ బ్రోవ సమయమిదే అతివేగమేవచ్చి
నా వెతలు దీర్చి కరుణించవే శంకరీ కామాక్షి ॥ దేవీ ॥

చరణములు:
లోకజననీ నాపై దయలేదా మాయమ్మా నీ దాసుడుగదా
శ్రీ కాంచివిహారిణీ కల్యాణీ ఏకామ్రేశ్వరుని ప్రియభామయైయున్న నీ
కేమమ్మా ఎంతో భారమా వినుమా నా తల్లి ॥ దేవీ ॥

రేపు మాపని చెప్పితే నే వినను దేవి
ఇక తాళను నేను ఈ ప్రొద్దు దయచేయవే కృపజూడవే
నీ పదాబ్జములే మదిలో సదా యెంచి నీ
ప్రాపు కోరియున్నానమ్మా ముదముతో మా తల్లి ॥ దేవీ ॥

శ్యామకృష్ణుని సోదరి కౌమారి శంకరి బింబాధరి గౌరి
హేమాచలజే లలితే పరదేవతే కామాక్షి నిన్నువినా
భూమిలో ప్రేమతో కాపాడే వారెవరున్నారమ్మా నా తల్లి ॥ దేవీ ॥

Syama Sastri : Devi Brova

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s