రాగం: కల్యాణి
తాళం: ఆది
పల్లవి:
శివే పాహి మా మంబికే! శ్రిత ఫలదాయకి ॥శివే॥
అను పల్లవి:
కావేరిజోత్తర తీరవాసిని కాత్యాయని ధర్మ సంవర్ధని ॥శివే॥
చరణములు:
స్వభావమౌ నీ ప్రభావము మహా
నుభావురాలైన భారతికి పొగ
డ భారమై యుండ భావజారా
తిభామ నే నెంత? భాగ్యదాయకి ॥శివే॥
కలార్థమిది శశికలాధరి యుప
వలారి మాయా విలాసిని స
కలాగమనుతె బలారి యన శుభ
ఫలా లొసగు పరమ లాలనమ్మున ॥శివే॥
చరాచరమయి కరారవిందము
న రామ చిలుకను బిరాన బూని
పరాకు జూడరాదు శ్రీరఘు
వరాప్తుఁడగు త్యాగరాజ వినుతే ॥శివే॥
Shive pahimam ambike : Tyagaraja