త్యాగరాజకీర్తన :సుందరి నీదివ్యరూపమును

రాగం: కల్యాణి 
తాళం: ఆది

పల్లవి:
సుందరి నీదివ్యరూపమును
జూడ దనకు దొరికెనమ్మ ॥ సుందరి ॥

అను పల్లవి:
మందగమన నీ కటాక్షబలమో
ముందటి పూజాఫలమో త్రిపుర ॥ సుందరి ॥

చరణములు:
భువిలో వరమౌ శ్రీమదాది
పురమున నెలకొన్న నీ సొగసువిని
సువివేకులైన బ్రహ్మాది
సురలు గుంపుగూడి
కవివాసరపు సేవ కనుంగొన
కలుగునా యనికరఁగుచు మదిలో
దివి దత్తరము పడుచు నుండఁగా
దీనజనార్తి హారిణి త్రిపుర ॥ సుందరి ॥

కలిలో దీనరక్షకి యని సభ
కలిగిన తావునఁ బొగడుదునమ్మా
సలలితగుణకరుణాసాగరి నీ
సాటి యెవరమ్మా
అలసివచ్చినందుకు నామనసు
హాయి చెందునా యని యుండఁగ మఱి
కలకలమని సురసతులు వరుసగాఁ
గొలుచు శుక్రవారపు ముద్దు త్రిపుర ॥ సుందరి ॥

నన్నుఁ గన్నతల్లి నా జన్మము
నాఁడు సఫలమాయెనమ్మా ఇపుడు
ఘనదరిద్రునికి పైకమువలెఁ గనుల పండువుగా
వనజనయన ఎండుపైరులపై జలము
వలె శుభదాయకి కామ
జనకుని సోదరి శ్రీ త్యాగరాజ మనోహరి గౌరి ॥ సుందరి ॥

Sundari Nee Divya Rupamunu : Tyagaraja

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s