రాగం: రీతిగౌళ
తాళం: ఆది
పల్లవి:
బాలే బాలేందు భూషణి భవరోగ శమని ॥బాలే॥
అను పల్లవి:
ఫాలలోచని! శ్రీ ధర్మసంవర్ధని
సకల లోక జనని ॥బాలే॥
చరణములు:
శీలె నను రక్షింపను జా
గేలె పరమపావని సుగుణ
జాలె నతజన పరిపాలన
లోలె కనకమయ సు
చేలె కాలవైరికి ప్రియమైన యి
ల్లాలవై యిందు వెలసినందుకు
శ్రీలలితె నీ తనయుఁడని నను కు
శాలుగా బిలువ వలెనమ్మ ॥బాలె॥
సారె సకల నిగమ వన సం
చారె చపలకోటి నిభ శ
రీరె దేవతాంగన పరి
వారె పామర జన
దూరె కీరవాణి శ్రీపంచనదపుర వి
హారివై వెలసినందు కిక నా
నార కోటులనెల్ల సహించి
గారవింపవలెనమ్మ శివె ॥బాలె॥
రామె ప్రణయార్తిహరాభి
రామె దేవకామిని ల
లామె త్యాగరాజ భజన స
కామె దుర్జనగణ
భీమె నా మనసున నీ చరణముల సదా
నేమముతో పూజజేసితిని శ్రీ
రామసోదరివై వెలసిన శ్రీ
శ్యామలె ధర్మ సంవర్ధని ॥బాలె॥
Bale Balendu Bhushani : Tyagaraja