రాగం: లలితా
తాళం: రూపకం
పల్లవి
హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి
హీన మానవాశ్రయం త్యజామి
అనుపల్లవి
చిర-తర సంపత్ప్రదాం
క్షీరాంబుధి తనయాం
మధ్యమ కాల సాహిత్యం
హరి వక్షఃస్థలాలయాం హరిణీం చరణ కిసలయాం
కర కమల ధృత కువలయాం మరకత మణి-మయ వలయాం
చరణం
శ్వేత ద్వీప వాసినీం శ్రీ కమలాంబికాం పరాం
భూత భవ్య విలాసినీం భూసుర పూజితాం వరాం
మాతరం అబ్జ మాలినీం మాణిక్యాభరణ ధరాం
గీత వాద్య వినోదినీం గిరిజాం తాం ఇందిరాం
మధ్యమ కాల సాహిత్యం
శీత కిరణ నిభ వదనాం శ్రిత చింతామణి సదనాం
పీత వసనాం గురు గుహ మాతుల కాంతాం లలితాం
Muttuswami Deekshit : Hiranmayeem Lakshmim