రాగం: మాధవ మనోహరి
తాళం: ఆది
పల్లవి
మహా లక్ష్మి కరుణా రస లహరి
మామవ మాధవ మనోహరి శ్రీ
అనుపల్లవి
మహా విష్ణు వక్ష స్థల వాసిని
మహా దేవ గురు గుహ విశ్వాసిని
మధ్యమ కాల సాహిత్యమ్
మహా పాప ప్రశమని మనోన్మని
మార జనని మంగళ ప్రదాయిని
చరణమ్
క్షీర సాగర సుతే వేద నుతే
క్షితీశాది మహితే శివ సహితే
భారతీ రతి శచీ పూజితే
భక్తి యుత మానస విరాజితే
మధ్యమ కాల సాహిత్యమ్
వారిజాసనాద్యమర వందితే నారదాది ముని బృంద నందితే
నీరజాసనస్థే సుమనస్థే సారస హస్తే సదా నమస్తే
Muttuswami Deekshit : Maha Lakshmi