రాగం: లలిత
తాళం: మిశ్ర చాపు
పల్లవి
నన్ను బ్రోవు లలితా వేగమే చాల
నిన్ను నెఱ నమ్మియున్న వాడగదా భక్త కల్పకలతా ॥ నన్ను ॥
అను పల్లవి
నినువినా ఎవరున్నారు గతి జననీ అతి వేగమే వచ్చి॥ నన్ను ॥
చరణములు:
పరాకు సేయకనేవచ్చి కృపసలుప రాదా మొఱ వినవా
పరాశక్తి గీర్వాణ వందితపాద నీ భక్తుడనమ్మా సంతతము ॥ నన్ను ॥
సరోజభవ కమలనాథ శంకరసురేంద్ర నుతచరితా
పురాణి వాణీ ఇంద్రాణీ వందిత రాణి అహిభూషణుని రాణీ ॥ నన్ను ॥
మదాత్ములైన దురాత్మజనులను కథలను పొగడి
సదా నే వరాల చుట్టి తిరిగితి వెతలనెల్ల దీర్చివరమొసగి ॥ నన్ను ॥
సుమేరు మధ్య నిలయే శ్యామకృష్ణుని సోదరి కౌమారి
ఉమా శ్రీ మీనాక్షమ్మా శంకరీ ఓ మహారాజ్ఞీ రక్షించుట కిది సమయము ॥ నన్ను ॥
Syama Sastri : Nannu Brovu Lalita