రాగం: భైరవి
తాళం: ఆది
పల్లవి
లలితే! శ్రీప్రవృద్ధే! శ్రీమతి
లావణ్య నిధిమతి ॥లలితే॥
అను పల్లవి
తెలివిని వర్ధిల్లు శ్రీ – తపస్తీర్థ నగర నిలయె ॥లలితే॥
చరణములు
తెలియని బాలుఁడగాదా అంబ
తెలివి నా సొమ్ముగాదా
చలము సేయ మరియాదా
చల్లని మాటలు బల్కరాదా ॥లలితే॥
బ్రోచువా రిలను లేక
జూచిజూడక పరాకా
యీ సుజనుల వేడగ లేక
నే దాసుఁడ నీవే గతిగాక ॥లలితే॥
కన్నతల్లి శుభవదనె మీ
యన్న దయకు పాత్రుడనె
తిన్నగ శరణు జొచ్చితినే
త్యాగరాజ మానస సదనె ॥లలితే॥
Lalite Sri Pravruddhe : Tyagaraja