శంకరభగవత్పాదుల సౌన్దర్యలహరీ : 2 :
తనీయాంసుం పాంసుం తవచరణ పంకేరుహ భవం
విరించిః సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ |
వహత్యేనం శౌరిః కథమపి సహశ్రేణ శిరసాం
హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళన విధిమ్ || 2 ||
అమ్మా! నీ పాదపద్మమునందలి ఒక ధూళికణాన్ని గ్రహించి, బ్రహ్మదేవుడు ఈ లోకాలను ఎలాంటి లోటూ లేకుండా నిర్మిస్తున్నాడు. ఆ ఈ లోకాలను విష్ణువు, ఎలాగో (చాలా శ్రమతో), తన వేయి శిరస్సులతో మోస్తున్నాడు. ఆ రేణువును హరుడు బాగా మెదిపి శరీరానికి విభూతిగా ధరిస్తున్నాడు.
Soundaryalahari 2