అమ్మలగన్నయమ్మముగురమ్మలమూలపుటమ్మచాల పె
ద్దమ్మసురారులమ్మకడుపారడిపుచ్చినయమ్మ తన్నులో
నమ్మినవేల్పుటమ్మలమనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వపటుత్వసంపదల్
అమ్మలందరికీ అమ్మ, ముగురమ్మలకూ మూలమైన అమ్మ అందరమ్మలకన్నా అధికురాలైన అమ్మ అసురుల అమ్మల కడుపులకు చిచ్చుపెట్టు అమ్మ తన్ను మనస్సులో నమ్ముకున్న దేవతల తల్లులకు చిత్తములో నిల్చియుండే అమ్మ, దయాసాగరి అయిన మా యమ్మ దుర్గాభవాని, నాకు మహత్త్వ,కవిత్వ, పటుత్వ సంపదల నిచ్చుగాక!
ఇది పోతనభాగవతము నుండి తీసుకొనబడినది.
Durga Dhyana Shlokam