భాద్రపద శుద్ధ నవమి: నన్దాదేవీ పూజా, కేదారవ్రతం

నన్దాదేవీ పూజా, కేదారవ్రతం

భాద్రపదశుక్లనవమ్యాం నన్దాదేవీపూజా కార్యా| సా పరవిద్ధా గ్రాహ్యా| ఉక్తఞ్చ భవిష్యోత్తరే-
మాసి భాద్రపదే యా స్యాన్నవమీ బహులే తథా|
సా తు నన్దా మహాపుణ్యా కీర్తితా పాపనాశినీ|| ఇతి|

అస్యాం కేదారవ్రతం కార్యం | సా మధ్యాహ్నవ్యాపినీ గ్రాహ్యా| తథా చ స్కాందే|
మాసి భాద్రపదే శుక్లే నవమీ యాష్టమీయుతా|
సైవ మధ్యాహ్నయోగేన మహాపుణ్యతమా భవేత్|
తత్ర కుర్యాద్ర్వతం పుణ్యం కేదారాఖ్యం ద్విజోత్తమాః|| ఇతి|

తత్ర మధ్యాహ్నం పఞ్చధా భక్తస్యాహ్నస్తృతీయో భాగః| తస్య చైకభక్తన్యాయేన షట్పక్షా అవతరణీయాః| పూర్వేద్యుః పరేద్యుః ఉభయేద్యురనుభయేద్యుర్వైషమ్యేణో భయేద్యుస్సామ్యేనేతి| తత్రాద్యయోరసన్దేహః| కర్మకాలవ్యాప్తేస్సత్వాత్| తృతీయపక్షే పూర్వా గ్రాహ్యా| ఉక్తఞ్చ స్కాన్దే-
నవమీ యది నధ్యాహ్నే వర్తతే హి దినద్వయా|
తదా పూర్వైవ కర్తవ్యా కేదారవ్రతతత్పరైః|| ఇతి|

చతుర్థషష్ఠయోరప్యనేనైవ న్యాయేన పూర్వా గ్రాహ్యా| అష్టమీవిద్ధాయాః ప్రాశస్త్యాత్| పఞ్చమపక్షే తు యత్ర మహతీ సా గ్రాహ్యా|

భాద్రపద శుద్ధ నవమినాడు నందాదేవి పూజ చేయవలెను. దీనికి పూర్వవిద్ధను గ్రహించవలెను. భాద్రపదమందు నవమి బహుళమందును గ్రహించి నందాదేవినర్చించినచో మహాపుణ్యమును, పాపనాశమును కల్గించునని భవిష్యోత్తరము చెప్పుచున్నది.

ఈ శుక్ల నవమినాడే కేదారవ్రతం చేయవలెను. దీనికి నవమి మధ్యాహ్నవ్యాపినిగా నుండవలెను. భాద్రపదశుద్ధ నవమి అష్టమీ వేధ కల్గి మధ్యాహ్నవ్యాపినిగా నున్నచో మహాపుణ్యప్రదము. అపుడే కేదారవ్రతము చేయుట ప్రశస్తమని స్కాందము చెప్పుచున్నది. మధ్యాహ్నమనగా దినము నైదుభాగములుగా చేసినచో నందు మూడవ భాగము. మధ్యాహ్నము ఏకభక్త న్యాయముచే ఆరురకముల పూర్వ, పర , ఉభయ, అనుభయ, సామ్య, వైషమ్యములు. మొదటి రెండు పక్షములు కర్మకాల వ్యాప్తిత్వము గలవి గాన అచ్చట సందేహముండదు. మూడవ పక్షమందు పూర్వదినమును గ్రహించవలెను. ఇదేవిషయమును స్కాందమును కూడ చెప్పినది. చతుర్థ, షష్ఠ పక్షములందు అష్ఠమీ విద్ధ ప్రశస్తముగాన పూర్వమునే గ్రహించవలెను. పంచమ పక్షమున ఏదినమున తిథి అధికముగా నుంటే ఆ దినమును గ్రహించవలెను.

(వ్రతనిర్ణయ కల్పవల్లీ పుస్తకము నుండి)

Bhadrapada Shuddha Navami: NandaDevi Puja, Kedaravratam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s