శ్రావణబహుళచవితి:సంకష్టహర చతుర్థీ

సంకష్టహర చతుర్థీ

శ్రావణకృష్ణచతుర్థీ సంకష్టహరచతుర్థీ| సా చన్ద్రోదయవ్యాపినీ గ్రాహ్యా| ఉక్తం చ బ్రహ్మపురాణే-
నభోమాసే చతుర్థ్యాం తు పక్షే శుక్లేతరే నృప|
సంకటాఖ్యం వ్రతం కుర్యాత్ యదా చంద్రోదయో భవేత్|| ఇతి|

సంకట్చతుర్థీ చన్ద్రోదయవ్యాపినీ గ్రాహ్యా| పరదినే చన్ద్రోదయవ్యాప్తౌ పరైవ| యదా దినద్వయే పి చన్ద్రోదయే చతుర్థీ వర్తతే తదా పరా గ్రాహ్యా| ఉభయదినే చన్ద్రోదయవ్యాపిత్వే తృతీయాయుతైవ గ్రాహ్యా| “ఇతి ధర్మసింధుమతమ్”(పూర్వైవేతి భావః)
తదుక్తం మార్కణ్దేయేన-
దినద్వయే పి వర్తేత చతుర్థీ యా విధూదయే|
పరైవ వ్రతిభిః కార్యా గణనాథపరాయణైః|| ఇతి|

యదా దినద్వయే చన్ద్రోదయవ్యాపినీ న స్యాత్ పరా గ్రాహ్యా|
తదాహ నారదః-
చన్ద్రోదయే యదా న స్యాద్యది వాపి దినద్వయే|
ప్రదోషవ్యాపినీ గ్రాహ్యా చతుర్థీ సంకటవ్రతే|| ఇతి|

దేవలో పి-
సూర్యోదయం సమారభ్య చతుర్థీ యా చ వర్తతే|
చన్ద్రస్యోదయపర్యన్తం సా భవేత్ సర్వకామదా|| ఇతి|

శ్రావణ బహుళ చవితి సంకట చతుర్థి. చంద్రోదయమునకు వ్యాపించిన చవితిని గ్రహించవలెను. అని బ్రహ్మపురాణము చెప్పుచున్నది.
సంకట చతుర్థీవ్రతమును చంద్రోదయమందు చేయవలెను. పరదినమందు చంద్రోదయవ్యాప్తి యున్నచో పరదినమునందే జరుపవలెను. రెండు దినములందు చంద్రోదయవ్యాప్తియున్నచో అనగా చంద్రోదయమునుకు చవితి యున్నచో, పరదినమునే గ్రహించవలెను.
రెండు దినములందు చవితి చంద్రోదయమునకు వ్యాప్తమైయున్నచో తదియతో గూడిన చవితిని అనగా పూర్వదినమునే గ్రహించాలని ధర్మసింధు మతము.
దినద్వయమునందు చవితి చంద్రోదయమునకు వ్యాప్తిగలిగి యున్నచో గణనాథపరాయణులగు వ్రతులు పరదినమందే చేయవలెనని మార్గండేయులు చెప్పిరి. రెండు దినములందు చవితి చంద్రోదయమునకు లేనిచో ప్రదోష వ్యాప్తి గల పరదినమునే గ్రహించవలెను.
సూర్యోదయకాలమునుండి చవితిచంద్రోదయ పర్యంతమున్నచో అది సమస్తమైన కోరికలను తీర్చునని దేవలుడు పలికెను.

సంకష్టహర చతుర్థీ వ్రతమును చేయుగోరువారు ఉదయమున మేల్కొని, నిత్య కృత్యంబులు దీర్చుకొని, నదికి వెళ్ళీ పొట్టూదీసిన తెల్లని నూవులు రాచుకొని స్నానము చేసి, యుదికిన మడిబట్టలు గట్టి, జపతపాదులు తీర్చుకొని, “నేను రేయివరకు నుపవాసముండి గణపతి వ్రతంబు చేసెదను” అని సంకల్పించుకొని యా ప్రకారము చంద్రోదయమైనతర్వాత, మండలము చేసి, యందష్టదళపద్మముమ్రుగ్గుపెట్టి, గంధాదులచే నలంకరించి, యందు గణేశుని మూడుకన్నులు నాల్గుచేతులు గల్గి యెర్రనిరూపు గలయట్లు ప్రతిమనుస్థాపించి, ప్రాణప్రతిష్ఠ గావించికల్పోక్తప్రకారంబుగ బూజింపవలయును. పది నూవుల కుడుములు చేసి, యైదుకుడుములు దేవుని సన్నిధి నుంచి, తక్కినయైదును బ్రాహ్మణునికి వాయనమిచ్చి, శక్తికొలది దక్షిణతాంబూలాదుల నొసగి, యావలదా నా యైదుకుడుములనుమాత్రముదిని యారేయియుండి మరునాడు పారణచేయవలయును. ఉపవాస ముండుటకు శక్తిలేదేని, యేకభుక్తంబుతోనుండినను నుండవచ్చును. ఆచార్యునివరించి, యిరువదియొక్కండ్రు ఋత్విక్కులను నియమించుకొని, రాత్రి కలశస్థాపనము చేసి, కల్పోక్తప్రకారముగా గణపతిని పూజించి, మరునాడుదయమున పునఃపూజ యొనరించి గణపతిమంత్రముచే ౧౦౦౮ మారులుగాని, ౧౦౮ మారులుగాని, ౨౮ మార్లుగాని, తుదకెనిమిదిమార్లుగాని హోమము గావించి, తర్వాత ఋత్విక్కులను గలశవస్త్ర ప్రతిమాదానంబులచే బూజించి సత్కరింపవలెను. ఈ వ్రతంబును తొలుత పార్వతికి గణపతి యుపదేశించెనని, కృష్ణుండు ధర్మరాజునకు నుపదేశించెను. స్కందుడు శౌనకాదిమహర్షులకు నుపదేశించెను. ఈ వ్రతంబును రావణుడును, బలిచక్రవర్తియు, రాముడును, సీతయు, మరియు అనేకులాచరించిరి. సంకటములందు జిక్కినవారు ఈ వ్రతంబు నాచరించినచో విముక్తులగును.

Shravana Bahula Chaviti : Sankashtahara Chaturthi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s