బృహత్తల్ప ద్వితీయ(అశూన్యశయన వ్రతము)
శ్రావణకృష్ణద్వితీయా బృహత్తల్పద్వితీయ| అస్యామశూన్యశయనవ్రతం కార్యం| సా పూర్వవిద్ధా గ్రాహ్యా| ఏవమేవ భాద్రపదాదిమాసత్రయకృష్ణద్వితీయాసు పూర్వవిద్ధాసు అశూన్యశయనవ్రతం కార్యం|
తదుక్తం స్కాందే-
నభఃప్రభృతిమాసేషు కృష్ణేష్వేవ చతుర్ష్వపి|
ద్వితీయాసు నరః కుర్యాదశూన్యశయనవ్రతమ్|| ఇతి|
తథా చ సంవర్తః-
కృష్ణాష్టమీ బృహత్తల్పా సావిత్రీవటపైతృకీ|
స్మరత్రయోదశీ రమ్భా ఉపోష్యాః పూర్వసంయుతాః|| ఇతి|
యత్తు వచనం-
చతుర్ష్వసితపక్షేషు మాసేషు శ్రావణాదిషు|
అశూన్యాఖ్యవ్రతం కుర్యాత్సజయాయాం విధూదయే|| ఇతి|
తద్దినద్వయే పరమృద్ధ్యా చంద్రోదయవ్యాపిత్వేన తిథేరల్పత్వాత్ తద్విషయమితి మన్తవ్యమ్| తథా చోక్తం కాలచన్ద్రికాయామ్|
యదా దినద్వయే భద్రా వర్తతే చేద్విధూదయే|
తదా గ్రాహ్యా పరైవ స్యాదశూన్యశయనవ్రతే|| ఇతి|
శ్రావణ బహుళ విదియ బృహత్తల్ప ద్వితీయ. ఈ విదియ యందు అశూన్యశయన వ్రతమును చేయవలెను. విదియను పూర్వవిద్ధగా గ్రహించవలెను. ఇదే అశూన్య శయన వ్రతము భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక మాసములందలి కృష్ణపక్ష విదియలందు పూర్వవిద్ధగా గ్రహించి చేయవలెను.
శ్రావణము మొదలుకొని నాలుగు మాసముల బహుళ విదియలయందు అశూన్య శయన వ్రతములను చేయమని స్కాందము చెప్పుచున్నది.
కృష్ణాష్టమి, బృహత్తల ద్వితీయా, సావిత్రీ, వటపైతృకీ, స్మరత్రయోదశీ, రంభావ్రతములందు పూర్వవిద్ధను గ్రహించి ఉపవసించవలెనని సంవర్తులు చెప్పిరి.
శ్రావణాది నాల్గు మాసముల బహుళ విదియలందు చంద్రోదయ కాలమున అశూన్య శయన వ్రతమును చేయవలెనని వచనము గూడ గలదు.
రెండు దినములందు వృద్ధిగామినిగా విదియ ఉన్నచో చంద్రోదయమును గ్రహించవలెను. అనగా మొదటి దినము నందలి చంద్రోదయమని భావము. రెండవ దినమున అశూన్య శయనవ్రతమును చేయవలెనని కాలచంద్రిక చెప్పుచున్నది.
Shravana Bahula Dwiteeya/ Vidiya