కర్నాటక సంగీత త్రిమూర్తులలో ఒక్కరైన శ్రీ ముత్తుస్వామిదీక్షితుల వరలక్ష్మీ దేవతా కృతి
శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యమ్
రాగము : శ్రీ రాగము తాళము : రూపకతాళము
పల్లవి:
శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యమ్ వసుప్రదే
శ్రీ సారసపదే రసపదే సపదే పదే పదే ॥ శ్రీ ॥
అనుపల్లవి:
భావజజనకప్రాణవల్లభే సువర్ణాభే ।
భానుకోటిసమానప్రభే భక్తసులభే
మధ్యమకాలసాహిత్యము:
సేవకజనపాలిన్యై శ్రితపంకజమాలిన్యై
కేవలగుణశాలిన్యై కేశవహృత్కే లిన్యై ॥ శ్రీ ॥
చరణము:
శ్రావణపౌర్ణమీపూర్వస్థశుక్రవారే
చారుమతీప్రభృతిభిః పూజితాకారే
దేవాదిగురుగుహసమర్పితమణిమయహారే
దీనజనసంరక్షణనిపుణకనకధారే
మధ్యమకాలసాహిత్యము:
భావనాభేదచతురే భారతీసన్నుతవరే
కైవల్యవితరణపరే కాంక్షితఫలప్రదకరే ॥ శ్రీ ॥
Sri Varalakshmi Namastubhyam