మహాగణాధిపతి పూజా

మహాగణాధిపతి పూజా

(వావిళ్ళ వారి వ్రత రత్నాకరము ఆధారంగా)

ప్రతీ నైమిత్తిక పూజలోనూ మహాగణాధిపతిపూజ చేయవలెను. ఈ పూజా సంకల్పం ముఖ్యపూజా సంకల్పంలో అంతర్భాగంగా ఉంటుంది, సంకల్పమునకు ముందుగా ఆచమనం, ప్రాణాయామాది శుద్ధి ప్రక్రియ కూడా ఉంటుంది. . పూర్తి విధి కోసం పుజా విధానం చూడవలెను.

ముందుగా పసుపు ముద్దతో గణపతి ప్రతిమను చేసుకొని కొస తూర్పుగానున్న తమలపాకుమీద ఉంచాలి. మహాగణాధిపతిని ఈ పసుపు గణపతిలోకి ఆవహన చేసి పూజించవలెను.

ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే(అని అనామికతో జలమును స్పృశించవలెను)

శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

  • మహాగణాధిపతయే నమః ధ్యాయామి. ( మహా గణాధిపతిని ధ్యానించాలి)
  • మహాగణాధిపతయే నమః ఆవాహయామి. (అక్షతలతో)
  • మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి.(అక్షతలతో)
  • మహాగణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి. (కలశోదకముతో)
  • మహాగణాధిపతయే నమః పాద్యం సమర్పయామి.(కలశోదకముతో)
  • మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి. (కలశోదకముతో)
  • మహాగణాధిపతయే నమః ఔపచారికస్నానం సమర్పయామి. (కలశోదకముతో)
  • మహాగణాధిపతయే నమః స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. (కలశోదకముతో)
  • మహాగణాధిపతయే నమః వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి.
  • మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి.(అక్షతలతో)
  • మహాగణాధిపతయే నమః గంధాన్ ధారయామి. (గంధమును ధరింపజేయవలెను)
  • మహాగణాధిపతయే నమః గంధస్యోపరి అలంకారణార్థం అక్షతాన్ సమర్పయామి. (అక్షతలతో)

పుష్పైః పూజయామి – (పుష్పములతో పూజించవలెను)
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదన్తాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణికాయ నమః
ఓం లంబోధరాయ నమః
ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కంధపూర్వజాయ నమః

ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి.

  • మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి. (ధూపం చూపించవలెను)
  • మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. (దీపం దర్శింపజేయవలెను)
  • మహాగణాధిపతయే యథాశక్తి __ నివేదనం సమర్పయామి. (నైవేద్యం సమర్పించవలెను)
  • మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. (కలశోదకముతో)
  • మహాగణాధిపతయే తాంబూలం సమర్పయామి. (తాంబూలం – మూడు తమలపాకులు, రెండు వక్కలు, రెండు పళ్ళు పెట్టి స్వామికి సమర్పించవలెను)
  • మహాగణాధిపతయే నీరాజనం సమర్పయామి.
  • నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. (కలశోదకముతో)

శ్లో|| వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభ|
అవిఘ్నం కురుమేదేవ సర్వ కార్యేషు సర్వదా||

  • మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి. (ఒక పుష్పం తీసుకుని పైన చెప్పిన శ్లోకం చదివి ఆ పుష్పాన్ని స్వామికి సమర్పించవలెను)
  • మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి.
  • సర్వోపచారపూజాః సమర్పయామి. (అక్షతలతో)

శ్లో|| యస్యస్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు|
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం||
శ్లో|| మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప|
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే||
అనయా షోడశోపచార పూజయా భగవాన్ సర్వదేవాత్మకః శ్రీ మహాగణాధిపతిః సుప్రసన్నో వరదో భవతు|
(అని అక్షతలు పువ్వులతో కూడ నీళ్ళు విడువవలసినది.)

శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి (పూజాక్షతలు శిరసున ధరించవలెను).

శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి. ( గణపతి ఉన్న తమలపాకు కొసను కొంత తూర్పుగా జరుపవలెను). శోభనార్థే పునరాగమనాయచ.

ఈ ప్రకారమున ప్రతి వ్రతమునకు మొదట వినాయకుని పూజ చేయవలయును. తరువాత ప్రధాన పూజ ఆరంభించవలెను.

1 Comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s