ఈశావాస్యోపనిషత్ – మన్త్రము 2

|| శంకరభాష్యము, తాత్పర్యము ||
ఏవమాత్మవిదః పుత్రాద్యేషణాత్రయసంన్యాసేనాత్మజ్ఞాననిష్ఠతయాఽత్మా రక్షితవ్య ఇత్యేష వేదార్థః | అథ ఇతరస్యానాత్మజ్ఞతయా ఆత్మగ్రహణాయ అశక్తస్యేదముపదిశతి మన్త్రః |
ఈ విధముగ పుత్రాది ఏషణాత్రయ సంన్యాసము చేత జ్ఞాని ఆత్మజ్ఞాననిష్ఠుడగుటచేత ఆత్మను రక్షించుకోవలెను అని వేదార్థము చెప్పుచున్నది. ఇక ఆత్మజ్ఞానము లేనివానికి ఈ మన్త్రము (దిగువనీయబడినది) ఇట్లు ఉపదేశించుచున్నది.

|| మన్త్రము : ౨ ||
కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగ్ం సమాః
ఏవం త్వయి నాన్యథేతోఽస్తి న కర్మ లిప్యతే నరే ||

|| తాత్పర్యము||
ప్రతిమానవుడు శాస్త్రము చెప్పిన ప్రకారము ఈ లోకమున కర్మనాచరించుచునే నూరు సంవత్సరములు జీవించవలయునని తలంచవలెను. (ఆత్మజ్ఞానము లేని) నీకు ఈ మార్గము (శాస్త్రవిహిత కర్మాచరణ) కంటే వేరుమార్గము లేదు. ఇట్టి శాస్త్రవిహిత కర్మాచరణవలన కర్మలు నిన్ను అంటవు.

|| శంకరభాష్యము, తాత్పర్యము ||
కుర్వన్నేవ ఇహ నివర్తయన్నేవ, కర్మాణి అగ్నిహోత్రాదీని, జిజీవిషేత్ జీవితుమిచ్ఛేత్, శతం శతసంఖ్యాకాః, సమాః సంవత్సరాన్ |
ఈ లోకమున అగ్నిహోత్రాది (యాగాది) కర్మలను చేయుచునే నూరు సంవత్సరములవరకు జీవింప తలంచవలెను.

తావద్ధి పురుషస్య పరమాయుర్నిరూపితమ్ | తథాచ ప్రాప్తానువాదేన యజ్జిజీవిషేచ్ఛతం వర్షాణి తత్ కుర్వన్నేవ కర్మాణీత్యేతద్విధీయతే |

పురుషునియొక్క అధికారికవయస్సు నూరుసంవత్సరములని వేదమునందు నిర్ణయించబడినది. కనుక మానవుడు ప్రాప్తించిన ఆయువును బ్రతుకవలయునని తలంపుచేత నూరు సంవత్సరములు జీవించదలచినచో వేదవిహితకర్మలను ఆచరించుచునే జీవించవలెను అని విధింపబడుచున్నది.

ఏవమ్ ఏవంప్రకారేణ, త్వయి జిజీవిషతి, నరే నరమాత్రాభిమానిని, ఇతః ఏతస్మాత్ అగ్నిహోత్రాదీని కర్మాణి కుర్వతో వర్తమనాత్ ప్రకారాత్, అన్యథా ప్రకారాన్తరం, నాస్తి యేన ప్రకారేణ అశుభం, కర్మ న లిప్యతే కర్మణా న లిప్యతే ఇత్యర్థః |
ఇట్లు ఈ ప్రకారముగా జీవించవలసిన నీకు (మనుష్యత్వమాత్రమునభిమానించు నీ కొఱకు) అగ్నిహోత్రాది కర్మలు చేయుకునే ఆయువు గడుపమని వేదము విధించుచున్నది. ఈ మార్గము కన్న వేఱొకమార్గము లేనేలేదు. ఈ మార్గముననుసరించుటచేత పాపకర్మలంటవు. అనగా ఆ పురుషుడు కర్మలిప్తుడు కాడు.

అతః శాస్త్రవిహితాని కర్మాణి అగ్నిహోత్రాదీని కుర్వన్నేవ జిజీవిషేత్ |
కనుక శాస్త్రవిహితకర్మలు ఆచరించుచునే జీవనేచ్ఛకలవాడై ఉండవలెను.

కథం పునః ఇదమ్ అవగమ్యతే పూర్వేణ సంన్యాసినో జ్ఞాననిష్ఠా ఉక్తా ద్వితీయేన తదశక్తస్య కర్మనిష్ఠా ఇతి ?
పూర్వ (మొదటి) మంత్రముచే సంన్యాసికి జ్ఞాననిష్ఠ, ద్వితీయమంత్రముచే అశక్తునకు (సంన్యాసము స్వీకరించుటకు అసమర్థుడైనవానికి) కర్మనిష్ఠ చెప్పబడినది అని ఎలా తెలుకోవలెను ? అని పూర్వపక్షము.

ఉచ్యతే : జ్ఞానకర్మణోర్విరోధం పర్వతవత్ అకమ్ప్యం యథోక్తం న స్మరసి కిమ్ ? ఇహాపి ఉక్తం యోహి జిజీవిషేత్ స కర్మ కుర్వన్, ’ఈశావాస్యమిదం సర్వం’ , ’తేన త్యక్తేన భుంజీథాః’ , ’మా గృధః కస్యస్విత్ ధనమ్’ ఇతి చ |
సంబంధభాష్యమున మొదటనే మేముచెప్పినదానిని స్మరింపకుంటివేమి ? జ్ఞానకర్మల వైరుధ్యము పర్వతమువలె స్థిరమైనది. ఇక్కడ కూడా (ఈ ఉపనిషత్తునందు కూడా) ’జీవించదలచినవాడు కర్మ చేయుచూ జీవించవలెను’, ’ఇదంతయు ఈశ్వరునిచే ఆవరింపబడి ఉన్నది’, ’ ఈ చరాచరజగత్తును త్యజించియే ఆత్మను రక్షించుకొనవలెను’, ’పర ధనమును ఆశించకుము’ అని చెప్పబడినది.

న జీవితే మరణే వా గృధిం కుర్వీత అరణ్యమ్ ఇయాత్ ఇతిచ పదమ్, తతో న పునరియాత్’, ఇతి సంన్యాస శాసనాత్ | ఉభయోః ఫలభేదం చ వక్ష్యతి | జీవితమునందుగాని, మరణమునందుగాని ఆశకూడదు. జ్ఞాననిష్ఠకొరకు సంన్యాసము విధింపబడినందున అరణ్యముపోవలెనని మరల తిరిగి రాకూడదని వేదము చెప్పుచున్నది. ఇకముందు ఈ రెండు నిష్ఠల ఫలభేదము కూడ చెప్పుచున్నారు.

ఇమౌ ద్వావేవ పన్థానౌ అను నిష్క్రాన్తతరౌ భవతః క్రియాపథశ్చ ఏవ పురస్తాత్ సంన్యాసశ్చ ఉత్తరేణ | నివృత్తి మార్గేణ ఏషణాత్రయ త్యాగః | తయోః సంన్యాసపథ ఏవ అతిరేచయతి | ’న్యాస ఏవాత్యరేచయత్’ ఇతి చ తైత్తిరీయకే |

ఈ రెండు మార్గములు సృష్ట్యారంభమునుండి పరంపరాగతముగ వచ్చుచున్నవి. వీటిలో మొదటిది కర్మమార్గము, రెండవది జ్ఞానమార్గము. కర్మమార్గము ప్రవృత్తిమార్గము. జ్ఞానమార్గము నివృత్తి మార్గము. నివృత్తిమార్గము ద్వారా ఏషణాత్రయము త్యజించబడును. ఈ రెండుమార్గములలో సంన్యాసమార్గమే ఉత్కృష్టమైనది. ఈ విషయమునే తైత్తిరీయశృతి కూడా ’న్యాస ఏవాత్యరేచయత్’ -’సంన్యాసమే పరాకాష్ఠనొందినదని’ చెప్పినది.

’ద్వావిమావథ పన్థానౌ యత్ర వేదాః ప్రతిష్ఠితాః | ప్రవృత్తి లక్షణో ధర్మో నివృత్తశ్చ విభావితః || ’ ఇత్యాది పుత్రాయ విచార్య నిశ్చితముక్తం వ్యాసేన వేదాచార్యేణ భగవతా |
వేదాచార్యుడగు వ్యాసభగవానుడు కూడా అనేకవిధములనాలోచించి తన పుత్రునకు ” ఈ రెంటిలోనే వేదము ప్రతిష్ఠించబడినది మొదటిది ప్రవృత్తి లక్షణధర్మము, రెండవది చక్కగా విచారించబడిన నివృత్తిధర్మము” అని చెప్పినాడు.

విభాగఞ్చ అనయోః దర్శయిష్యామః |
ఈ రెండిటి విభాగము ఇకముందు చర్చించబడును.

Isavasyopanishat shankara bhashyam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s