తవుడుగౌరి నోము కథ

తవుడుగౌరి నోము కథ

ఒక భాగ్యశాలి ఎనుబది ఏళ్ళ వృద్ధురాలై ఉన్నప్పటికీ ఆమె అత్తమామలనూ , తల్లితండ్రులనూ, బంధువులనూ , బిడ్డలనూ ఎడబాయక సంతోషముగానుండెను. ఆమెను చూసి ఊరివారందరూ ఆశ్చర్యపడుతూ ” ఏమి నోచితివమ్మా ! ఎవరినీ వదలకుండా నిండు సంసారముతో ఉన్నావు” అని అడుగగా?  ” అమ్మలారా! ఇది వాయనమందిన నోము ఫలమే కాని , నోచిన ఫలము కాదు. పూర్వము మాయమ్మ తవుడు గౌరి నోము నోచుకొని నాకు వాయనము ఇచ్చినది. ఇది అంతయూ వాయనపు చలవే అని చెప్పెను. ” అది విని వారు వాయనమందితేనే ఇంత ఫలము చెందగా నోము నోచినచో ఇంకెంత ఫలము అబ్బునో కదా అని అనుకొని నాటినుండీ ఆ నోము నోచుకొనుచూ దీర్ఘాయురారోగ్య ఐశ్వర్యములతో విలసిల్లుచుండిరి. ఈకథను చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.

ఉద్యాపన:
తవ్వ నిండుగా బియ్యము పోసి పైన కొద్దిగా తవుడుతో కప్పి , చీరతోనో లేక రవికెలగుడ్డతోనో పుణ్యస్త్రీకి వాయనమీయవలెను.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s