యమునాష్టకం

శంకరస్తోత్రాలు : యమునాష్టకం

కృపాపారావారాం తపనతనయాం తాపశమనీం
మురారిప్రేయస్యాం భవభయదవాం భక్తివరదామ్ ।
వియజ్జ్వాలోన్ముక్తాం శ్రియమపి సుఖాప్తేః పరిదినం
సదా ధీరో నూనం భజతి యమునాం నిత్యఫలదామ్ ॥ 1॥

దయకు సముద్రం వంటిది, సూర్యుని కుమార్తె, తాపత్రయమును పోగొట్టునట్టిది, శ్రీకృష్ణుని ప్రియురాలు, సంసార భయమును దహించు దవాగ్ని, భక్తులకు వరములిచ్చునది, విషజ్వలాలనుండి విముక్తురాలైనది, సుఖములు ననుభవించు సమ్పదల నిచ్చునది, నిత్యమైన ఫలము లిచున్నది, అగు యమునా నదిని ధీరుడగు వాడు ఎల్లప్పుడు తప్పక సేవించును.

మధువనచారిణి భాస్కరవాహిని జాహ్నవిసఙ్గిని సిన్ధుసుతే
మధురిపుభూషణి మాధవతోషిణి గోకులభీతివినాశకృతే ।
జగదఘమోచిని మానసదాయిని కేశవకేలినిదానగతే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ ॥ 2॥

బృందావనమునందు ప్రవహించుదానవు, సూర్యపుత్రివి, గంగతో చేరుదానవు, సముద్ర సుతవు, శ్రీకృష్ణుని అలంకరించుదానవు, మాధవుని సంతోష పెట్టుదానవు, గోకులము యొక్క భయమును నశింపచేయు దానవు, ప్రపంచము నందలి పాపమును పోగొట్టుదానవు, మంచి మనస్సు నిచ్చుదానవు, శ్రీకృష్ణును క్రీడలకు కారణమైన దానవు, భయమును నివారించుదానవు, కష్టములను నాశనం చేయుదానవు, అగు ఓ యమునా! నన్ను పవిత్రుని చేయుము.

అయి మధురే మధుమోదవిలాసిని శైలవిదారిణి వేగపరే
పరిజనపాలిని దుష్టనిషూదిని వాఞ్ఛితకామవిలాసధరే ।
వ్రజపురవాసిజనార్జితపాతకహారిణి విశ్వజనోద్ధరికే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ ॥ 3॥

మధురమైన జలం కలదానవు, పర్వతములను కూడ పగులగొట్టు వేగం కలదానవు, సేవించు వారిని పాలించుదానవు, దుష్టులను హింసించుదానవు, కోరిన కామవిలాసములు కలదానవు, గోకుల వాసుల పాపములను తొలగించుదానవు, సకల జనులను ఉద్ధరించుదానవు, భయమును నివారించుదానవు, కష్టములను తొలగించుదానవు అగు ఓ యమునా !నన్ను పవిత్రుని చేయుము.

అతివిపదమ్బుధిమగ్నజనం భవతాపశతాకులమానసకం
గతిమతిహీనమశేషభయాకులమాగతపాదసరోజయుగమ్ ।
ఋణభయభీతిమనిష్కృతిపాతకకోటిశతాయుతపుఞ్జతరం
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ ॥ 4॥

ఆపదలు అను సముద్రమునందు మునిగిన వాడను, సంసారము నందలి కష్టములతో కలత చెందిన వాడను, గతి లేని వాడను, మతి లేని వాడను, అనంతములైన భయములతో నీ పాదపద్మములను ఆశ్రయించిన వాడను, ఋణభయముతో పీడింపబదుచున్న వాడను, నిష్కృతిలేని కోట్లాది పాపములు చుట్టుకున్న వాడను, అగు నన్ను ఓ యమునా! భయము నివారించి, కష్టములను తొలగించి పవిత్రుని చేయుము.

నవజలదద్యుతికోటిలసత్తనుహేమభయాభరరఞ్జితకే
తడిదవహేలిపదాఞ్చలచఞ్చలశోభితపీతసుచేలధరే ।
మణిమయభూషణచిత్రపటాసనరఞ్జితగఞ్జితభానుకరే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ ॥ 5॥

బంగారు ఆభరణాలతో ప్రకాశించు నల్లని మబ్బువంటి శరీరము కలదానవు, మెరుపు కంటే ప్రకాశవంతమైన పాదముల వరకు కదలుచున్న పట్టుచీర ధరించినదానవు, సూర్యకిరణములకంటే ప్రకాశవంతమైన మణిమయ భూషణములు వస్త్రములు ధరించిన దానవు, భయమును నివారించుదానవు, కష్టములను తొలగించుదానవు అగు ఓ యమునా! నన్ను పవిత్రుని చేయుము.

శుభపులినే మధుమత్తయదూద్భవరాసమహోత్సవకేలిభరే
ఉచ్చకులాచలరాజితమౌక్తికహారమయాభరరోదసికే ।
నవమణికోటికభాస్కరకఞ్చుకిశోభితతారకహారయుతే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ ॥ 6॥

శుభకరమైన ఇసుక తిన్నెలు కలదానవు, శ్రీకృష్ణుని రాసక్రీడలలో నిండిన దానవు, ఇసుక తిన్నెలు ముత్యాల హారాలు, మణులు అంచులు యందుగల సూర్యుని వలే ప్రకాశించు రవిక ధరించిన దానవు, భయమును నివారించుదానవు, కష్టములను, తొలగించుదానవు అగు ఓ యమునా! నన్ను పవిత్రుని చేయుము.

కరివరమౌక్తికనాసికభూషణవాతచమత్కృతచఞ్చలకే
ముఖకమలామలసౌరభచఞ్చలమత్తమధువ్రతలోచనికే ।
మణిగణకుణ్డలలోలపరిస్ఫురదాకులగణ్డయుగామలకే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ ॥ 7॥

ఏనుగు తొండమునకు అలంకరించెడి ముత్యాల దండ వలే ఉన్న చంచల తరంగములు కలదానవు, ముఖకమలము నుంది వ్యాపించు పరిమళములకై తిగుచున్న తుమ్మెదలవంటి కన్నులు కలదానవు, మణికుండములతో, శోభిల్లుచున్న చెంపలు కలదానవు, భయమును నివారించుదానవు, కష్టములు తొలగించుదానవు అగు ఓ యమునా! నన్ను పవిత్రుని చేయుము.

కలరవనూపురహేమమయాచితపాదసరోరుహసారుణికే
ధిమిధిమిధిమిధిమితాలవినోదితమానసమఞ్జులపాదగతే ।
తవ పదపఙ్కజమాశ్రితమానవచిత్తసదాఖిలతాపహరే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ ॥ 8॥

బంగారు అందెలు మనోహరముగా ధ్వనించు ఎర్రనైన పాదపద్మములు కలదానవు, ధిమిధిమిధిమిధిమి తాళములతో మనసు రంజిల్ల చేయు గమనము కలదానవు, నీ పాదములనాశ్రయించిన వారి సమస్త కష్టములను తొలగించుదానవు, భయమును నివారించుదానవు కష్టములను తొలగించుదానవు అగు ఓ యమునా! నన్ను పవిత్రుని చేయుము.

భవోత్తాపామ్భోధౌ నిపతితజనో దుర్గతియుతో
యది స్తౌతి ప్రాతః ప్రతిదినమన్యాశ్రయతయా ।
హయాహ్రేషైః కామం కరకుసుమపుఞ్జై రవిసుతాం
సదా భోక్తా భోగాన్మరణసమయే యాతి హరితామ్ ॥ 9॥

సంసార సముద్రమునందు పడిన మానవుడు కష్టములపాలై చేతులలో పువ్వులు పట్టుకొని , గుర్రపు సకిలింత వంటి పెద్ద స్వరములతో ప్రతి దినము భక్తిగా ఈ స్తోత్రమును చదువుచు యమునను ప్రార్థించినచో జీవితాంతము సుఖముననుభవించి మరణసమయమునందు విష్ణుస్వరూపమును పొందును.

||ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృత యమునాష్టకమ్ సమ్పూర్ణమ్||

Yamunashtakam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s