చిత్రగుప్తునినోము కథ
ఒక రాజ భార్య, మంత్రిభార్య అన్ని నోములు సమానంగా జేయుచుండిరి. కాని రాజు భార్య చిత్రగుప్తుని నోము నోచుట మరచిపోయెను. ఆ నోము మంత్రి భార్య నోచెను. కొంత కాలమునకు వారిద్దరూ చనిపోయిరి. అప్పుడు చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గమును రాజుభార్యకు నరకమును ఇచ్చెను. అది విని రాజుభార్య ’ స్వామీ! మంత్రిభార్యవలె నేనును వ్రతములను చెసితిని నాకు నరకము వచ్చుటకు కారణమేమి?” అని అడిగెను. అప్పుడు అతడామెకు ’చిత్రగుప్తుని నోమునోచలేదు’ గనుక జరిగెనని, చెప్పను. ఆమె అతనిని బ్రతిమాలి తిరిగి భూలోకమునకు వచ్చి ఆ నోము నోచుకొని పిదప స్వర్గలోకమునకు వెళ్ళెను.
ఉద్యాపన:
ఈ కథ చెప్పుకొని యేడాది అక్షతలు వేసుకొని ఉద్యాపన చేయవలెను. కట్లు లేని గంపలో యెడ్లుతొక్కని వడ్లు ఐదు కుంచములో పోసి, వాటిలో నొక గుమ్మడి పండు అడ్డెడు తవ్వెడు బియ్యము, ఐదు మూరలు పట్టుపంచె పెట్టి దక్షిణ తాంబూలములతో, వెండి ఆకుతో, బంగారు గంటముతో అన్నగారికి గాని, గ్రామకరణమునకుగాని ఇవ్వవలెను.
ChitraGuptuni Nomu